చరణ్ హీరోయిన్.. ఇలా షాకిచ్చిందేంటబ్బా..!

బాలీవుడ్ లో ఇప్పుడు వరుస ఆఫర్లతో అది కూడా సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఆలియా భట్ ముందు వరుసలో ఉంటుంది. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఓ హీరోయిన్ గా రాజమౌళి తీసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ లో ఈ బ్యూటీ రాంచరణ్ కు జోడీగా కనిపించబోతుంది. రాంచరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఈమె పాత్ర 15 నిముషాలు మాత్రమే ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఏ హీరోయిన్ అయినా ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంటే.. ఎక్కువగా ఆ హీరోయిన్ గురించే చెబుతుంటుంది.. కానీ ఆలియా బట్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చింది.

Alia Bhatt with Vijay Devarakonda

తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా భట్.. మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ‘మీకు ఏ హీరో స్టైల్ నచ్చుతుంది’ అని యాంకర్ ప్రశ్నించగా… ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పి అందరికీ షాకిచ్చింది. విజయ్ స్టైల్ నిజంగా సూపర్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఇక హీరోయిన్స్ లో అయితే అనుష్క శర్మ స్టైల్ అంటే ఇష్టమని చెప్పింది ఆలియా భట్.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.