ఎలిమినేషన్ అంతా ఉత్తుత్తేనా… అసలు మ్యాటర్ ఏంటి?

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ ఎపిసోడ్ లో భాగంగా గత వారం అలీ రెజా ఎలిమినేటయిన సంగతి తెలిసిందే. అంతటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇంటి సభ్యులతో పాటు, ఆడియన్స్ కు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. అలీ రెజా కచ్చితంగా ‘టాప్ 5’ లో ఉంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ నామినేషన్స్ లోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అవ్వడం మామూలు ట్విస్ట్ కాదు. ఇదిలా ఉండగా… అలీ తన సోషల్ మీడియాలో తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘ ‘బిగ్ బాస్’ నుండీ ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వెళ్ళగానే నాకు పిడుగులాంటి బ్యాడ్ న్యూస్ ఎదురైంది. నేను ‘బిగ్ బాస్’ లో పాల్గొంటున్న సమయంలోనే మా మావయ్య చనిపోయాడు. ఈ విషయం నాకు ఇంటికి వెళ్ళాకే తెలిసింది.

7ali-reza

‘నా కుటుంబ సభ్యులు ‘బిగ్ బాస్ షో’ … నా కెరీర్ కు చాలా కీలకం అని భావించారు. నేను గేమ్ పై ఫోకస్ చేయడానికి ఈ వార్తని నాకు చెప్పలేదు. ఈ వార్త నాకు తెలిస్తే నేను ‘బిగ్ బాస్’ హౌస్ లో గేమ్ పై ఫోకస్ చేయలేనని మా తల్లిదండ్రులకు తెలుసు. అదే సమయంలో నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ముఖ్యం. నేను కెరీర్ లో సక్సెస్ సాధించాలి, ఇంకా ఎదగాలని కోరుకునే వారిలో మా మావయ్య ఒకరు.ఎలిమినట్ అయి షాక్ లో ఇంటికి వెళ్ళిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది. ఇంతటి బాధలో కూడా నా ఫ్యామిలీ నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించింది” అంటూ అలీ రెజా చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం పైనే ఇప్పుడో వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ విషయం వలనే బిగ్ బాస్ కావాలని అలీ ని ఎలిమినేట్ చేసాడని… ఇప్పటివరకూ నామినేషన్స్ కు రాలేదు కాబట్టి .. అలీ ఆ అవకాశం బిగ్ బాస్ కు ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో మళ్ళీ బిగ్ బాస్ కు అలీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది నిజమే అయితే అలీ అభిమానులు మళ్ళీ పండగ చేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు.a

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.