అలాద్దీన్

90లలో పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు “అలాద్దీన్”. స్కూల్ పుస్తకాల్లో మాత్రమే కాక కార్టూన్ నెట్వర్క్ లోనూ ఇబ్బడిముబ్బడిగా చూసిన ఈ కార్టూన్ కి చిత్రరూపంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలరే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ హాలీవుడ్ లైవ్ యానిమేషన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి ఆలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ చేత, జినీ పాత్రకు విక్టరీ వెంకటేష్ చేత డబ్బింగ్ చెప్పించారు. మరి వారి డబ్బింగ్ సినిమాకు ఎంతవరకూ ప్లస్ అయ్యిందో చూద్దాం..!!

aladdin-movie-review1

కథ: ఇదేమో కొత్త కథ కాదు.. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన కథ. యువరాణి జాస్మిన్ ను పెళ్లాడడం కోసం జేబు దొంగ ఆలాద్దీన్ ను ప్రేమించడం, ఆమె ప్రేమను దక్కించుకొనే ప్రయత్నంలో దుష్టుడైన జాఫర్ మాయాజాలంలో ఇరుక్కొని ఓ పురాతన ద్వీపాన్ని తెచ్చివ్వడం కోసం చేసిన ప్రయత్నంలో గుహలో ఇరుక్కుపోవడం. అనంతరం జీనీ సహాయంతో ఆ గుహ నుంచి బయటకు రావడమే కాక యువరాణిని పెళ్లాడడం కోసం జీనీ మ్యాజిక్ ను కూడా వినియోగించుకొంటాడు.

మళ్ళీ జాఫర్ ఎంట్రీతో ఆలాద్దీన్ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి? ఏమిటా మార్పులు, చివరికి ఏం జరిగింది అనేది “ఆలాద్దీన్” కథాంశం.

aladdin-movie-review2

నటీనటుల పనితీరు: ఆలాద్దీన్ గా మేనా మస్సూద్, జాస్మిన్ గా నయోమీ స్కాట్ ల జంట చూడముచ్చటగా ఉంది. వారి పెర్ఫార్మెన్స్, హావభావాలు కార్టూన్ క్యారెక్టర్స్ ను తలపించడం విశేషం. ఇక చిలిపి జీనీగా విల్ స్మిత్ 100% యాప్ట్ అన్నట్లుగా కనిపించాడు, నటించాడు.

aladdin-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: ఆలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడం బాగుంది కానీ.. పాత్రధారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా వాయిస్ ను కాస్త టోన్ డౌన్ చేయడంతో.. వరుణ్ డబ్బింగ్ చెప్పాడు అని తెలిసినవాళ్ళకి తప్పితే.. తెలియనివాళ్లు ఆ గొంతుకు గుర్తుపట్టడం కష్టం.

అయితే.. జీనీ పాత్రకు వెంకటేష్ డబ్బింగ్ భలే సింక్ అయ్యింది. వెంకీలోను చురుకుతనం, వెటకారం జీనీ పాత్రను ఇంకాస్త బాగా ఎలివేట్ చేయడమే కాక జనాలను ఎంటర్ టైన్ చేసింది. బహుశా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తూ జనాలు ఎంజాయ్ చేసిన ఏకైక చిత్రం ఇదే అనుకుంటా. వెంకీ డబ్బింగ్ వాయిస్ జోకులకు ప్రేక్షకులు పడీ పడీ నవ్వాల్సిందే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. డిస్నీ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆ విషయాలను ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదు.

సినిమా మొత్తానికి మైనస్ ఏమైనా ఉంది అంటే.. అవి కథతోపాటుగా కథనాన్ని వివరిస్తూ సాగే పాటలు మాత్రమే. కొన్ని పాటలు సాహిత్యం సెట్ అవ్వక నచ్చకపోతే.. ఇంకొన్ని పాటలు సందర్భం అర్ధం కాక ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. కానీ.. ఆ పాటలు ఇరికించినవైతే కాదు.. ఒరిజినల్ కార్టూన్ చూసినవాళ్లందరికీ నచ్చుతాయి. ఆలాటు లేని కొత్త ప్రేక్షకులకు మాత్రమే ఈ పాటలు కాస్త బోర్ కొట్టిస్తాయి.

aladdin-movie-review4

విశ్లేషణ: ఇదేమో కొత్త కథ కాదు, కానీ కార్టూన్ యానిమేషన్ లో చూసినవాళ్లందరికీ మరోసారి సినిమాగా చూడడం మాత్రం ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్. 90ల కాలంలో పుట్టిన వారికి, నేటి తరం పిల్లలకు బాగా నచ్చే సినిమా “ఆలాద్దీన్”.

aladdin-movie-review5

రేటింగ్: 2.5/5

Share.