సాహోతో పోటీకి సిద్ధమవుతున్న అక్షయ్ కుమార్

“బాహుబలి” అనంతరం విడుదలవుతున్న సినిమా కావడంతో “సాహో” మీద ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లిపోయింది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దాంతో “సాహో” సినిమాకి పోటీగా మరో సినిమాను విడుదల చేసే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. కానీ.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం ప్రభాస్ స్టార్ డమ్ & క్రేజ్ కి కానీ, “సాహో” సినిమాకి ఉన్న పాపులారిటీని కానీ కేర్ చేయడం లేదు అక్షయ్. ఇదివరకు కూడా తను నటించిన “రోబో 2.0″కి పోటీగా తన హిందీ సినిమాను విడుదల చేయించుకొన్నాడు అక్షయ్.

ఇప్పుడు తన తాజా చిత్రమైన “మిషన్ మంగల్”ను “సాహో”కి పోటీగా విడుదల చేయనున్నాడు అక్షయ్ కుమార్ సరసన సొనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యామీనన్ లు నటించిన ఈ హిందీ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. “సాహో” స్థాయి క్రేజ్ మాత్రం లేదు. ముఖ్యంగా “సాహో” టీజర్ విడుదల తర్వాత ఆగస్ట్ 15, 2019కి మరో సినిమా వీడుదలయ్యే అవకాశమే లేదనుకొన్నారు. కానీ.. అక్షయ్ మాత్రం పట్టుబట్టి మరీ ఆదేరోజున “మిషన్ మంగల్”ను విడుదల చేయిస్తున్నాడు. మరి సాహో క్రేజ్ ముందు అక్షయ్ పంతం ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.

Share.