అక్షర ట్రైలర్ రివ్యూ: ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు

రియాలిటీ కథలకు ఈ రోజుల్లో వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక సామాజిక అంశాలపై వస్తున్న సినిమాలపై కూడా ఓ వర్గం ఆడియేన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కిన అక్షర మూవీ కూడా స్పెషల్ బజ్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనిపిస్తోంది. నందిత శ్వేతా, షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్ వంటి నటీనటులు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు.

ట్రైలర్ తోనే అక్షర సినిమా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలను కరెక్ట్ గా చూపిస్తోంది. ఇక విద్య అనేది ఈ రోజుల్లో ఒక వ్యాపారంలా మారిందనే పాయింట్ ను హైలెట్ చేసినట్లు అర్ధమయ్యింది. అలాగే ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంతో మంది విద్యార్థులు కూడా ఒత్తిడికి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు అనే అంశాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు. ఇక ఒక డెత్ మిస్టరీ కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా ఉన్నట్లు ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు.

డైలాగ్స్ కూడా ఎడ్యుకేషన్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఫీజు కట్టిన ప్రతీ స్టూడెంట్ కి సీటు ఇవ్వాలి.. సీటు ఇచ్చిన ప్రతి స్టూడెంట్ కి ర్యాంక్ రావాల్సిందే.. అనే డైలాగ్ తో పాటు.. గొప్ప గొప్ప స్కూల్ కాలేజిలలో పిల్లల్ని జాయిన్ చేస్తున్నామని తల్లిదండ్రులు బాగానే చెప్పుకుంటున్నారు గాని దాని వెనుక పిల్లలు పడే నరకయాతనను పట్టించుకోవడం లేదని అంశాన్ని కూడా లేవనెత్తారు. మరి ఈ అంశాలు ఫుల్ సినిమాలో ఎలా ప్రజేంట్ చేస్తారో చూడాలి. బి.చిన్ని కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.