అఖిల్ కోసం సమంత సెట్ చేసిన స్టోరీ

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి విజయం గత కొంతకాలంగా అందని ద్రాక్షగా మారింది. అన్నయ్య నాగ చైతన్య, నాన్న నాగార్జున గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తుంటే అఖిల్ మాత్రం ఇంకా మొదటి సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. హిట్టు పడితే గాని కెరీర్ కు ఒక బూస్ట్ రాదు. ఎలాగైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఆ సినిమా అనంతరం సురేందర్ రెడ్డి సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏమిటంటే.. అఖిల్ కోసం అతని వదిన సమంత ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేయించిందట. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన రాజ్ – డీకేలు త్వరలోనే అఖిల్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఉపుమీదున్న ఈ దర్శకద్వయం తెలుగులో మొదట్లో D ఫర్ దోపిడీ అనే సినిమా చేశారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

కానీ వారికి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ దక్కింది. వారిద్దరు తెలుగు వారే కావడంతో మళ్ళీ సొంత భాషలో ఒక బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక సమంత వారి నుంచి విన్న కథకు అఖిల్ ను సజెస్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే..

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.