తల్లి ఆవేదన.. అఖిల్ సైలెన్స్

బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ గా నిలిచినా అఖిల్ పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు అతను ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఊహించలేదు. ఎప్పుడో మధ్యలోనే వెళ్లిపోవచ్చని అఖిల్ కూడా భావించాడు. అయితే అదృష్టవశాత్తు అతనికి కొన్ని పరిస్థితులు కలిసొచ్చాయి. పైగా అఖిల్ కూడా బాగానే కష్టపడ్డాడు గాని మధ్యలో అభిజిత్ గొడవలు, మోనాల్ తో విబేధాలు మైనెస్ అయ్యేలా చేశాయి. ఒక విధంగా ఫైనల్ 2 వరకు వచ్చిన అఖిల్ విషయంలో ఒకటి మాత్రం బాగా వైరల్ అవుతుంది.

ఫైనల్ రోజు హోస్ట్ నాగార్జున విన్నర్ ను ప్రకటించే క్రమంలో అఖిల్ చేయిని ఒక్కసారిగా కిందకు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ తల్లి కూడా ఆ విషయంలో చాలానే బాధపడింది. అయితే అఖిల్ ఫైనల్ 2లో నిలవడం తనకేమి బాధ కలిగించలేదని ఆ విషయంలో అఖిల్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడని అన్నారు. అయితే నాగార్జున చేయి విదిలించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో నాగార్జునపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

మరీ ఆ రేంజ్ లో అక్కడ ఓడిపోయినా వ్యక్తిని తక్కువ చేసి చూపించినట్లు అనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. అఖిల్ తల్లి ఎమోషనల్ గా స్పందించిన తరువాత ఆ న్యూస్ మరింత వైరల్ అవుతోంది. అయితే ఇంతవరకు అఖిల్ ఆ విషయంపై స్పందించలేదు. తనకేమి పట్టనట్లుగానే ఉన్నాడు. మారీ రానున్న రోజుల్లో ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న ఎదురైతే ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.