బిగ్ బాస్ 4: ‘AV’ చూశాక అఖిల్ కాన్ఫిడెన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి 100రోజులు పూర్తి అయిన తర్వాత వాళ్ల జెర్నీ ఎలా సాగింది అనేది ఎవి రూపంలో చూపిస్తాడు బిగ్ బాస్. ఇది ప్రతి సీజన్ లో జరిగే ప్రక్రియే. ఇప్పటి వరకూ వాళ్లు గేమ్ ఆడిన విధానం, టాస్క్ లు ఆడిన పద్దతి, ఇలాగే బంధాలు – అనుబంధాలు కలుపుకున్న విధానం, హౌస్ మేట్స్ మధ్యలో స్నేహం, ప్రేమ , త్యాగం, వివాదం, పెంచుకున్న అనురాగం, పంచుకున్న మమకారం ఇలా అన్ని భావోద్వేగాలని ఈ ఎవిలో హౌస్ మేట్స్ చూస్తారు.

అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ మేట్స్ బిహేవియర్ ని మెచ్చుకునే తీరు, వాళ్ల నడవడిక హౌస్ లో ఎలా ఉందో చెప్పే తీరు విని ఎమోషనల్ గా ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. ఈసారి సీజన్ లో కూడా బిగ్ బాస్ లాస్ట్ వీక్ లో హౌస్ మేట్స్ AV లని చూపించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ముందుగా అఖిల్ తన జెర్నీని హౌస్ లో ఎలా ఉందో ఒక్కసారి చూసుకున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాడు అఖిల్. చాలా పాజిటివ్ గా ఉందని, ఈ జెర్నీ చూస్తుంటే ఇక్కడి వరకూ రావడం నా అదృష్టమని అన్నాడు.

ఈ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కి రుణపడి ఉంటానని చెప్తూనే, నా జెర్నీ ప్రజెంటేషన్ చూస్తుంటే నేను విన్నర్ అవుతానని నాకు అనిపిస్తోందని, ఖచ్చితంగా ట్రోఫీని ఇంటికి తీసుకెళ్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అఖిల్. ప్రస్తుతం ఫినాలే ఓటింగ్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ జెర్నీలు హౌస్ మేట్స్ కి మంచి ప్లస్ కాబోతున్నాయి. మరి దీనివల్ల ఓటింగ్ శాతంలో ఏదైనా అనూహ్యంగా మార్పు వస్తుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ కి లాగిన్ అవ్వండి.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.