మోనాల్‌‌తో పెళ్లి అనగానే.. యాంకర్‌కు అఖిల్ కౌంటర్

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో అఖిల్ సార్ధక్ ఒకరు. హౌజ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అఖిల్ పెద్దగా క్రేజ్ అందుకోలేదు. ప్రతిసారీ ఓ వర్గం ఆడియెన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకోవాల్సి వచ్చింది. మోనాల్ తో ప్రేమాయణం అలాగే అభిజిత్ తో పోటీగా నిలిచి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. అతను ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఊహించలేదు.

ఇక ఎదో ఒక విధంగా ఫైనల్ వరకు వచ్చిన అఖిల్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ 4 అనగానే ఎక్కువగా అందరికి గుర్తుకు వచ్చేది మోనాల్, అఖిల్ లవ్ ట్రాక్ అనే చెప్పాలి. ఇక హౌజ్ నుంచి వారు బయటకు వచ్చిన అనంతరం పెళ్లి చేసుకుంటారేమో అనేంతలా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు అఖిల్ కాస్త నవ్వుతూనే అసహనం వ్యక్తం చేశాడు.

మోనాల్ తో మీ పెళ్లి ఎప్పుడు అంటూ యాంకర్ అడుగగా.. అసలు నికెందుకురా నా పెళ్లి గురించి అంటూ స్వీట్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో యాంకర్ మరో మాట అనలేదు. ఇక మెల్లగా తన సినిమాల గురించి అడగడంతో త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఉంటుందని అన్నాడు. సీటీమార్ సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్నకు నో కామెంట్ అంటూ అఖిల్ మ్యాటర్ ను డైవర్ట్ చేశాడు. మరి అతను నటుడిగా ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.