బిగ్ బాస్ 4: అఖిల్ ఆరాటం.. మోనాల్ పోరాటం..!

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ అద్భుతంగా పోరాడింది. మునుపెన్నడు చూపించని తెగువని చూపిస్తూ తనకోసం తను మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ గట్టిగా ఫైట్ చేసింది. 12వ వారం నామినేషన్స్ లో మోనాల్ తన మాటలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా అవినాష్ కి గట్టిగా సమాధానం చెప్పింది. అలాగే, తన ప్రియమైన స్నేహితుడు అఖిల్ కి కూడా సాలిడ్ కౌంటర్స్ ఇచ్చింది. మాటలతోనే తూటాలని పేల్చుతూ అఖిల్ గుండెని తూట్లు పొడిచింది.

నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బజర్ మోగగానే గార్డెన్ ఏరియాలో ఉన్న క్యాప్స్ నిమె ధరించమన్నాడు బిగ్ బాస్. దీంతో ఫస్ట్ అఖిల్, తర్వాత సోహైల్, అవినాష్, అరియానా , అభిజిత్ , అరియానాలు పరుగుపరుగున వెళ్లి క్యాప్స్ ధరించారు. అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. క్యాప్స్ లో ఉన్న రెడ్ కలర్ తలమీద పడినవాళ్లు నామినేట్ అయ్యారని, గ్రీన్ కలర్ పడినవాళ్లు సేఫ్ అయ్యారని చెప్పాడు. ఇక్కడే నామినేట్ అయినవాల్లు శవపేటికలో ఉండి, తాము ఇంట్లో ఉండేందుకు ఎందుకు అర్హులో, బయట ఉన్నవాళ్లు ఎందుకు అనర్హులో చెప్పి స్వైప్ చేసుకోమని చెప్పాడు.

ఇక్కడే వాడి – వేడి ఆర్గ్యూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అందరికీ మోనాల్ వీక్ కంటెస్టెంట్ గా కనిపించింది కాబట్టి మోనాల్ తో ఆర్గ్యూ పెట్టుకున్నారు. మోనాల్ గేమ్ ని చూపిస్తూ మోనాల్ ఎంత వీకో అందరికీ అర్ధమయ్యేలా చెప్తూ తనతో స్వాప్ చేస్కోవడానికి చూశారు. కానీ, మోనాల్ ఎక్కడా కూడా తడబడకుండా సాలిడ్ ఆన్సర్స్ ఇచ్చింది. ఫస్ట్ అవినాష్ కి ఆన్సర్ చెప్పింది. ఆ తర్వాత అఖిల్ కి క్లాస్ పీకింది. ఇప్పటి వరకూ మీరు నాకు చేసింది చాలు, ఇప్పుడు నేను సేఫ్ జోన్ లో ఉన్నాను అంటూ మాట్లాడింది. ఇక్కడే హారిక కెప్టెన్సీ టాస్క్ గురించి అఖిల్ వేసిన ప్రశ్నలకి సాలిడ్ గా సమాధానం చెప్పింది.

అఖిల్ గురించి శాక్రిఫైజ్ చేస్తుందని అనుకున్నారు కానీ ఆ పని చేయలేదు మోనాల్. లాస్ట్ టైమ్ కలర్స్ టాస్క్ అప్పుడు ఇలాగే నామినేషన్స్ లో అఖిల్ మోనాల్ ఉంటే అప్పుడు అఖిల్ కోసం మోనాల్ నామినేట్ అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో నేను నా ప్లేస్ ని వదలను అని మాట్లాడింది. తర్వాత అఖిల్ కూడా ఎక్కడా తగ్గకుండా నేను స్వాప్ చేసుకోవాలి అని అనుకోవడం లేదని చెప్పాడు. ఇక్కడ అఖిల్ మోనాల్ తో కటాఫ్ చేస్కోవడానికి డిసైడ్ అయినట్లుగానే సోహైల్ తో చెప్పడం అనేది అఖిల్ ఆరాటాన్ని చూపిస్తే, మోనాల్ సోహైల్ తో అఖిల్ కి స్వైప్ చేయాలని ఉన్నా కూాడ నేను నాకోసం గేమ్ ఆడానని చెప్తూ తన పోరాటాన్ని చూపించింది.

మోనాల్ చేసిన ఆర్గ్యూమెంట్ కి ఇచ్చిన దెబ్బకి అఖిల్ కి మైండ్ బ్లాక్ అయిపోయిందనే చెప్పాలి. దీంతో అంతా క్లియర్ అయ్యింది. థ్యాంక్యూ సోమచ్ అంటూ మాట్లాడి ముక్తాయింపు ఇచ్చాడు అఖిల్. చివరకి హారిక కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి మోనాల్ ని అభిజిత్ తో స్వైప్ చేసింది. అదీమేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.