ఆ ఒక్క మాటతో పాయల్ రాజ్ పుత్ చాలా మారింది : అజయ్ భూపతి

పాయల్ రాజ్ పుత్… టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరోయిన్. ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. పాయల్ కు అంత క్రేజ్ రావడానికి కారణం..ఆమె మొదటి చిత్రమైన ‘ఆర్. ఎక్స్.100’. ఆ చిత్రంలో ఆమె గ్లామర్ షోతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చాలా ఈజ్ తో చేసేసింది. ఇక ఆమె అంత బాగా చెయ్యడానికి కారణాన్ని రెవీల్ చేసాడు ఆ చిత్రం దర్శకుడు..

అజయ్ భూపతి. ఆయన మాట్లాడుతూ…” ‘ఆర్. ఎక్స్.100’ చిత్రం కథ మొత్తం ఇందు అనే అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రను తెలుగు హీరోయిన్లు ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించి.. చాలా మందిని సంప్రదించాను. కానీ వాళ్లెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో పాయల్ ను ఎంపిక చేసుకున్నాను.కొన్ని రోజుల పాటు ఆమె కూడా ఏదో మొక్కుబడిగా షూటింగుకి వచ్చి వెళ్లేది.

Director Ajay Bhupathi's Maha Samudram Movie1

అది గమనించిన నేను ‘ఈ సినిమాకి మీ పాత్రనే కీలకం .. మీరు ఇలా చేస్తే మీ పాత్ర చెడిపోతుంది .. యూనిట్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది’ అని చెప్పాను. దాంతో ఆమె అలర్ట్ అయ్యి పాత్రలో ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టింది. నేను ఆ ఒక్క మాట చెప్పడం వల్లే ఆమె ఆ పాత్రని అంత బాగా పండించింది .. ఈరోజు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది” అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.