సహనం కోల్పోయిన తేజు..!

ఎట్టకేలకు ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు సాయి తేజ్. చాలా పోటీ ఉన్నప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కల్లెక్షన్లని రాబడుతుంది. ఇదే ఆనదంలో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశాడు. ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చాడు తేజు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా తేజుకి ఊహించని కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటితో చాలా విసిగిపోయినట్టున్నాడు తేజు. అంతేకాదు చాలా వరకూ సహనం కోల్పోయినట్టున్నాడు. ఈ ప్రశ్నలకి ఘాటుగా జవాబులిస్తూ సోషల్ మీడియా నెటిజెన్ల పై కూడా మండిపడ్డాడు. ఈ ప్రశ్నల్లో తేజు కి రెజినా తో ప్రేమ వ్యవహారం దగ్గర్నుండీ నిహారిక తో పెళ్ళి అంటూ వచ్చిన గాసిప్పులు గురించి ఉన్నాయి.

వీటి పై తేజు స్పందిస్తూ.. “ప్రస్తుతం నా పెళ్ళి గురించి ఏమీ ఆలోచించడం లేదు. కానీ నా పెళ్ళి విషయంలో చాలా స్టుపిడ్ రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నీహారికతో పెళ్ళి అంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. చిన్నప్పటి నుండీ నేను.. నీహారిక ‘బ్రదర్ అండ్ సిస్టర్’ లా పెరిగాం. మా మధ్య పెళ్ళి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. అయినా చెల్లిని పెళ్లి చేసుకోవడమేంటి..? ఛీ ఛీ ఇది చాలా వరస్ట్ ….! ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గుండాలి..! నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. నీహారిక నాకు చెల్లితో సమానం. దయచేసి ఈ వార్తలు రాసేవాళ్ళు ఇక ఆపండి. అలాగే ఈ వార్తల పై కామెంట్లు చేసేవాళ్ళు కూడా” అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు తేజు.

Share.