నమ్రత, మహేష్ కంటే పెద్దదంటే నమ్ముతారా..?

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ స్టార్ కపుల్ మహేష్ అండ్ నమ్రత శిరోద్కర్ . వీరిపెళ్ళై దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 2005లో మహేష్ బాలీవుడ్ నటి నమ్రతను రహస్య వివాహం చేసుకున్నారు. అప్పట్లో మహేష్-నమ్రతల వివాహం ఒక సంచలనం. 2000లో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో మహేష్ ఆమెతో ప్రేమలో పడ్డారు. కారణం ఏమిటో తెలియదు కానీ, వీరు ఎవ్వరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు.

Age difference between Mahesh Babu and Namrata1

కాగా నేడు నమ్రత పుట్టినరోజు రోజు. ఆమె 1972 జనవరి 22న జన్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నమ్రత మహేష్ కంటే దాదాపు 4ఏళ్ళు పెద్దది. మహేష్ 1975లో జన్మించగా వీరి మధ్య నాలుగేళ్ళ వయసు వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం నమ్రత వయసు 48ఏళ్ళు కాగా, మహేష్ కి కేవలం 44 సంవత్సరాలే. సెలెబ్రిటీ వివాహాలలో ఇది కామన్ విషయం. ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. అలాగే చాలా ఏజ్ గ్యాప్ ఉన్న అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారు. లెజెండ్ సచిన్ తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని చేసుకున్నారు. మహేష్ అభిప్రాయాలను గౌరవించే నమ్రత ఇద్దరు పిల్లలకు తల్లిగా, మహేష్ మేనేజర్ గా ఉంటూ ఆయన సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.