వకీల్ సాబ్ నుంచి రెండో పాట వచ్చేది ఈవారంలోనే!

సరిగ్గా ఎడాది క్రితం పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” నుంచి “మగువ మగువ” అనే పాట విడుదలైంది. పాటలో పవన్ కళ్యాణ్ ఎక్కడా లేకపోయినప్పటికీ.. సినిమా నుంచి ఎట్టకేలకు ఒక అప్డేట్ వచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. తమన్ కూడా రెగ్యులర్ గా కాకుండా మంచి ట్యూన్ తో అందించిన మగువ మగువ పాట ఇంస్టామ్ట్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కరోనా వల్ల ప్రమోషన్స్ గట్రా ఆగిపోయాయి. మధ్యలో టీజర్ వచ్చి పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.

అయితే.. ఏప్రిల్ 9న విడుదలవ్వాల్సిన సినిమాకి మార్చి వచ్చినా ప్రమోషన్స్ లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. వాళ్ళ టెన్షన్ ను అర్ధం చేసుకున్నారో ఏమో దిల్ రాజు & టీం కొత్త పాటను ఎనౌన్స్ చేశారు. రేపు (మార్చి 3) “వకీల్ సాబ్” చిత్రం నుంచి టైటిల్ సాంగ్ “సత్యమేవ జయతే” సాయంత్రం 5.00 గంటలకు విడుదలవుతుంది. ఆల్రెడీ ఈ ట్యూన్ బీట్ ను టీజర్ లోనే టేస్ట్ చూపించాడు తమన్. మరి రేపు విడుదలవ్వాబోయే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

నిజానికి “మగువ మగువ” తర్వాత తమన్ నుంచి ఆకట్టుకొనే మరో ట్యూన్ ఇప్పటివరకూ రాలేదు. మధ్యలో విడుదలైన పాటలన్నీ సోసోగానే మిగిలిపోయాయి కానీ.. తమన్ మార్క్ కనిపించలేదు. మరి “సత్యమేవ జయతే” ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.