నీవి హాలీవుడ్ సినిమాలకు కాపీ అన్న నెటిజన్ కు శేష్ రిప్లై

ఎవరైనా నీ సినిమాలు ఫలానా సినిమాకి రీమేక్ లేదా ఫ్రీమేక్ అని అంటే.. సదరు సినిమాల రచయిత/హీరో అయిన వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు.. మహా అయితే ఆ ప్రశ్న/కామెంట్ ను పట్టించుకోకుండా ఉంటారు. ఒకవేళ రియాక్ట్ అయినా అడివి శేష్ లా మాత్రం రియాక్ట్ అవ్వరు. “ఎవరు” సక్సెస్ ను భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్.. నిన్న సాయంత్రం కూడా బుక్ మై షోలో “ఎవరు” బుకింగ్స్ హౌస్ ఫుల్ గా ఉండడాన్ని ఆనందంతో షేర్ చేసుకొన్నాడు. అయితే.. ఆ స్టేటస్ అప్డేట్ కింద ఓ అడివి శేష్ అభిమాని.. “నీ సినిమాకి వచ్చిన టాక్ బట్టి “గూఢచారి” సినిమా చూశాను.. కానీ అది హాలీవుడ్ చిత్రం “కింగ్స్ మెన్”కి కాపీలా ఉంది. దయచేసి ఒరిజినల్ సినిమా తీయండి” అని కామెంట్ చేశాడు.

adivi-sesh-strong-reply-to-netizen1

దానికి రిప్లై గా అడివి శేష్.. “నువ్ నా సినిమాలు చూడకు, ఎందుకంటే నేను తీసే సినిమాలు నీలాంటి వాళ్ళ కోసం కాదు. నిన్ను ట్రోల్ చేస్తున్నా అని ఫీల్ అవ్వకూ, కానీ నువ్వు మాత్రం నా సినిమాలు చూడకు” అని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత కొందరు నెటిజన్లు శేష్ ను సపోర్ట్ చేసి, ఇంకొందరు తిట్టారు కానీ.. ఓవరాల్ గా శేష్ కే ఎక్కువ సపోర్ట్ లభించింది. అయితే.. శేష్ బాబు సినిమాలు కాపీ కొడుతున్నాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. అంత తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఫిలిమ్స్ అందిస్తూ.. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడం మాత్రం శేష్ కి మాత్రమే చెల్లింది.

Share.