గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న అడివి శేష్

టాలీవుడ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమాలు చేస్తూ మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు అడివి శేష్. మొదట్లో ‘పంజా’ ‘బలుపు’ ‘రన్ రాజా రన్’ ‘బాహుబలి’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. అటు తరువాత ‘దొంగాట’ ‘క్షణం’ ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ తాజాగా ‘ఎవరు’ వంటి చిత్రాల్లో నటించి హీరోగా కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ గా ‘కిస్’ అనే చిత్రం చేసి చేతులు కాల్చుకున్న శేష్.. శంకర్ వంటి బడా దర్శకడు సినిమాలో అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

adivi-sesh-rejected-director-shankars-movie1

శేష్ మాట్లాడుతూ .. ” శంకర్ గారు ‘బాయ్స్’ సినిమా రూపొందిస్తోన్న రోజులవి. నిర్మాత ఏ.ఎం.రత్నం గారు పిలిచి మరీ నాకు అవకాశం ఇచ్చారు.అయితే అప్పటికే నేను కృష్ణవంశీగారు చేయనున్న ‘మల్లెపువ్వు’ సినిమా కోసం ఎంపికయ్యాను. ‘ఇలా ‘బాయ్స్’ సినిమాలో ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని కృష్ణవంశీ గారికి చెప్పాను. ‘మల్లెపువ్వు’ చేస్తావో .. ‘బాయ్స్’ చేస్తావో నువ్వే ఆలోచించుకో’ అని నిర్ణయాన్ని ఆయన నాకే వదిలేశారు. తమిళంలో ‘బాయ్స్’ చేయడం కన్నా, తెలుగులో రూపొందే ‘మల్లెపువ్వు’ చేయడమే మంచిదనే ఉద్దేశంతో శంకర్ సినిమాను వదులుకున్నాను. తీరా చూస్తే ‘మల్లె పువ్వు’ సినిమా ఆగిపోయింది .. ‘బాయ్స్’లో చేసిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.