శంకర్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట..!

అవును శంకర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఏ హీరోయిన్ అయినా సరే.. ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పేస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ అలా హీరోయిన్ ఛాన్స్ వచ్చినా సరే దానిని మిస్ చేసుకుని.. ఇప్పుడు నెగిటివ్ రోల్స్ చేస్తుంది ఓ నటి. ఆమె మరెవరో కాదు తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ. కెరీర్ ప్రారంభంలో ఈమె హీరోయిన్ గా సినిమాలు చేసింది.

కానీ ఆశించిన స్థాయిలో ఈమె సక్సెస్ కాలేదు. తరువాత నెగిటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రవితేజ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘క్రాక్’ సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఇదిలా ఉండగా ఈమెకు.. ‘బాయ్స్’ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది వరలక్ష్మీ. ఆమె మాట్లాడుతూ..’ ‘బాయ్స్’ మూవీలో హీరోయిన్ గా చెయ్యమని మొదట నన్ను సంప్రదించారు.

కానీ అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసుకే యాక్టింగ్ వద్దని మా నాన్నగారు చెప్పడంతో ఆ ఛాన్స్ వదులుకున్నాను. అటు తర్వాత ఆ చిత్రంలో జెనిలీయాను హీరోయిన్ గా పెట్టుకున్నారు.కొన్నాళ్ళకి నా చదువును పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టాను’ అంటూ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.