లంగా వోణిలో వరలక్ష్మీ శరత్ కుమార్.. ఫోటోలు వైరల్..!

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్.దాంతో ముందు మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలని భావించి నెగిటివ్ రోల్స్ చెయ్యడం మొదలు పెట్టింది. అయినప్పటికీ తమిళంలో ఈమె సక్సెస్ కాలేకపోయింది. ‘పందెం కోడి2’ ‘సర్కార్’ వంటి బడా చిత్రాల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ.. అవి ఈమెకు కలిసి రాలేదు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. ‘క్రాక్’ ‘నాంది’ వంటి చిత్రాల్లో ఈమె నటనకి ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా ఈమెకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు.

ఆల్రెడీ బన్నీ- కొరటాల సినిమాలో ఈమె ఫైనల్ అయ్యిందని వినికిడి. ఆ చిత్రంలో ఓ పొలిటికల్ లీడర్ గా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఈమె కనిపించనుందట. ఆ చిత్రం కనుక హిట్ అయితే ఈమె మరో శివగామి అయిపోయినట్టే అని చెప్పాలి. ఇది పక్కన పెడితే సినిమాల్లో చాలా రఫ్ గా.. కిల్లింగ్ లుక్స్ తో కనిపించే వరలక్ష్మీలో గ్లామర్ యాంగిల్ కూడా దాగుందా అనే సందేహమొస్తే.. దానికి ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ను జవాబుగా చెప్పుకోవచ్చు.

లంగా వోణిలో ఈ అమ్మడు తన నేచురల్ అందాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛాన్స్ ఉంటే.. సినిమాల్లో ఈమెను సెకండ్ హీరోయిన్ గా కూడా తీసుకోవచ్చు ఏమో. అంటే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ లాగా అనమాట. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వరలక్ష్మీ లేటెస్ట్ ఫోటోలను ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.