Actress Sangeetha: ఆచార్యలో సంగీత పాత్ర ట్విస్ట్ ఇదేనా..?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పదిరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే ఆచార్య దసరా రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవుతున్న సంగీత ఆచార్య మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాకు సంగీత పాత్ర కీలకమని తెలుస్తోంది.

ఆచార్య మూవీలో ఇంటర్వల్ సీన్ లో సంగీత పాత్ర చనిపోతుందని ఆ తరువాత చరణ్ ఎంట్రీ ఉండనుందని సమాచారం. సినిమాలో సంగీత నర్తకి పాత్రలో నటిస్తుందని ఆమె చనిపోయే సన్నివేశాలు వెరీ ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. కొరటాల శివ మెగా ఫ్యాన్స్ మెచ్చే అన్ని అంశాలు ఆచార్యలో పుష్కలంగా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సినిమాలో మెగాస్టార్ దేవాదాయశాఖకు చెందిన ఉద్యోగిగా, నక్సలైట్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గడంతో పాటు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఆచార్య సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిర్మాతకు సినిమా రిలీజ్ కు ముందే లాభాలు వచ్చినట్టు భోగట్టా. కొరటాల శివ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.