అలాంటి భర్త తనకు దొరికారంటున్న సమీరారెడ్డి

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సమీరారెడ్డి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అశోక్, నరసింహుడు సినిమాల్లో సమీరారెడ్డి హీరోయిన్ గా నటించారు. అయితే సమీరారెడ్డి తెలుగులో నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన సమీరారెడ్డి హిందీ, తమిళ భాషల్లో మాత్రం వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.

2014 సంవత్సరంలో అక్షయ్ వార్దేని వివాహం చేసుకున్న సమీరా రెడ్డి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే పెళ్లి తరువాత బరువు పెరిగిన సమీరారెడ్డి బరువు పెరగడం గురించి, పెళ్లికి ముందు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తల్లైన తరువాత ఎవరైనా బరువు పెరుగుతారని ఆ బరువును అసహ్యించుకోవడం సరికాదని సమీరారెడ్డి అన్నారు. మన శరీరం ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించాలని.. ఎవరైనా బరువు గురించి అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదని సమీరా తెలిపారు.

2014 సంవత్సరానికి ముందు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తనకు తరచూ ఎదురయ్యేవని సమీరా చెప్పారు. అమ్మాయంటే చాలు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో వేధిస్తారని మొదటి బిడ్డ పుట్టాక ఒక బిడ్డ చాలా..? ఇంకో బిడ్డను ప్లాన్ చేస్తున్నారా..? అనే ప్రశ్న ఎక్కువమంది అమ్మాయిలకు ఎదురవుతుందని సమీరా తెలిపారు. చాలామంది అమ్మాయిలు ఈ ప్రశ్నలను ఎదుర్కోలేక భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని.. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని సమీరా తెలిపారు. సమీరా అక్షయ్ లకు ఒక పాప, ఒక బాబు. తనకు అర్థం చేసుకునే భర్త దొరికారని సమీరా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.