నటి రోజాకు మేజర్ ఆపరేషన్!

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు సర్జరీ జరిగింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి తెలిపారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఈరోజు ఐసీయూ నుండి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేస్తారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజా పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు. ఇదివరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని..

కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని.. ఇప్పుడు సర్జరీలు సక్సెస్ ఫుల్ గా జరిగాయని సెల్వమణి చెప్పారు. అయితే ఆమెకి ఏ ఆపరేషన్ జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని.. సందర్శకులు ఎవరూ హాస్పిటల్ కు రాకూడదని రిక్వెస్ట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని సెల్వమణి చెప్పారు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగిన రోజా.. ప్రస్తుతం రాజకీయనాయకురాలిగా కొనసాగుతున్నారు. గత రెండు, మూడు నెలలుగా రోజా చాలా బిజీగా ఉన్నారు.

ఫిబ్రవరిలో పంచాయితీ ఎలెక్షన్స్, మార్చిలో మున్సిపల్ ఎలెక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ హడావిడి తగ్గిన తరువాత రోజా చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో సర్జరీలు చేయించుకున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు టెన్షన్ పడుతుండడంతో ఆమె భర్త ఆడియో టేప్ రూపంలో పరిస్థితిని వివరించారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.