Roja Daughter: రోజా కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..!

జబర్దస్త్ జడ్జి మరియు ఆంధ్రప్రదేశ్ ఎం.ఎల్.ఎ అయిన రోజా కూతురు ఇప్పటికీ పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి ఈమె కూడా స్టార్ స్టేటస్ ను అనుభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తన వయసుకు తగినట్టుగా తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. రోజా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడమనేది చాలా అరుదు.

ఈమె తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావడం విశేషం. ఇక రోజా కూతురు అన్షు మాలిక ఫోటోలు మొన్నామధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు చూసినప్పటి నుండీ అన్షు సినీరంగ ప్రవేశం ఎప్పుడు అంటూ డిస్కషన్లు మొదలయ్యాయి.అందుతోన్న సమాచారం ప్రకారం.. త్వరలో అన్షు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట.

అందుకు గాను ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో కూడా ఈమె శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ అగ్ర దర్శకులతో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా ఈమెతో సినిమాలు చెయ్యడం కోసం రోజా మరియు సెల్వమణిలను సంప్రదిస్తున్నట్టు టాక్.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.