ఈ రాజకీయ పొత్తు గురించి సంతోషపడిన ఏకైక హీరోయిన్ ఈమే

నిన్న సాయంత్రం బీజేపీ-జనసేన పార్టీలు తమ పొత్తును ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చలేదు. చెగువేరా స్పూర్తితో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం పార్టీ నడుపుతాడు అనుకుంటే.. ఆంధ్రాలో ఈ బీజేపీతో పొత్తు రాజకీయాలు ఏమిటో అని అందరూ బాధపడ్డారు. చాలామంది జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు కూడా. కానీ.. ఈ పొత్తు పుణ్యమా అని ఒక హీరోయిన్ మాత్రం తెగ సంబరపడిపోయింది. ఆ హీరోయిన్ పేరు మాధవీలత.

Naga Shaurya about Aswathama Movie

“నచ్చావులే” సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైన తెలుగమ్మాయి మాధవీలత. అనంతరం నానితో కలిసి ఒక సినిమా చేసింది. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ నటించినప్పటికీ ఎందుకో మాధవీలత హీరోయిన్ గా నెగ్గుకురాలేకపోయింది. దాంతో.. రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. బీజేపీ తరపున గుంటూరు నుండి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది కానీ.. నెగ్గలేకపోయింది. అయినప్పటికీ బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా కొనసాగుతుంది మాధవీలత. ఇప్పుడు బీజేపీ-జనసేన పొత్తు పుణ్యమా అని తెగ ఆనందపడిపోతుంది. ఇదే కదా నేను కోరుకున్నది అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

Actress Madhavi latha Reacts on Janasena Chief Pawan Kalyan1

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.