సమస్యలు ఎవరికైనా వస్తుంటాయి : రాశి

సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసినా హిట్లు మీద హిట్లు కొట్టి.. క్రేజ్ ను సంపాదించుకుంది రాశి. ఇండస్ట్రీకి ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చింది. రాశి అసలు పేరు విజయలక్ష్మి అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీకాంత్ తో ‘ప్రేయసి రావే’, వడ్డె నవీన్ తో ‘మనసిచ్చి చూడు’ ‘స్నేహితులు’, జగపతి బాబు తో ‘శుభాకాంక్షలు’, పవన్ కళ్యాణ్ తో ‘గోకులంలో సీత’ వంటి హిట్ చిత్రాల్లో ఈమె నటించింది.

అంతేకాదు మహేష్ బాబు ‘నిజం’ సినిమాలోనూ… అలాగే బాలకృష్ణ ‘కృష్ణబాబు’ సినిమాలోనూ ఈమె నటించింది కానీ .. అవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇక తరువాత నాగ శౌర్య హీరోగా నందినీ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో కూడా ఈమె తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే … ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.

ఆ వార్తల పై రాశీ తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ..”నేను సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. నా కుటుంబంతో నేను సంతోషంగా గడుపుతున్నాను. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని… వాటిని దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి” అంటూ రాశీ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.