హీరోని ప్రేమించి ఇబ్బందిపడ్డ హీరోయిన్!

తెలుగులో ‘హాయ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కన్నడ బ్యూటీ నిఖిత. ఈ సినిమా తరువాత ఈమె తెలుగు చాలా చిత్రాల్లో నటించింది. నిఖిల్, వేణు, శ్రీకాంత్ లాంటి హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత తెలుగులో కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో నిఖితకి ఛాన్స్ లు రావడం తగ్గిపోయాయి. దీంతో కన్నడకి షిఫ్ట్ అయిపోయి అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది.

వరుస అవకాశాలతో కన్నడ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఓ ప్రముఖ కన్నడ సినీ నటుడితో నిఖిత ప్రేమాయణం నడిపించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే ఆ హీరోకి పెళ్లైంది. కానీ అతడు నిఖితతో ఎఫైర్ సాగించాడు. నిఖిత కోసం ఆ హీరో ముంబైలో ఓ ఇల్లు కొనిచ్చాడని, అలానే తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడంటూ కొందరు చర్చించుకుంటున్నారు. చివరికి ఈ విషయంలో పెద్ద గొడవ జరగడంతో దాదాపు మూడేళ్ల పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీ నిఖితను నిషేధించింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిఖిత సినిమాలపై దృష్టి పెట్టలేకపోయింది. దీంతో నటిగా ఆమెకి అవకాశాలు తగ్గాయి. అడపాదడపా సినిమాల్లో నటించినా.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గగన్ దీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికో పాప కూడా ఉంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.