హీరోయిన్ విగ్రహానికి పాలాభిషేకం!

బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో అఖిల్ తో రొమాన్స్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. కానీ రామ్ తో నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తొలి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో నిధికి వరుస అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

అంతేకాదు..పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న సినిమాలో నిధిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాతో తనకు స్టార్ డం వస్తుందని నమ్ముతోంది నిధి. ఇదిలా ఉండగా.. తాజాగా నిధి అగర్వాల్ కి అభిమానులు గుడి కట్టించడం హాట్ టాపిక్ గా మారింది. తమ అభిమాన నటి కోసం తెలుగు, తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేకాకుండా.. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు.

ఆ తరువాత కేక్ కట్ చేయించారు. విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నిధి అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిధి కోసం విగ్రహం కట్టించి.. పాలాభిషేకాలు చేస్తున్నారంటే ఆమెకి ఎంత క్రేజ్ ఉందోనని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఈ విషయం ఇంకా నిధి వరకు వెళ్లినట్లు లేదు. ఆమెకి తెలిసిన తరువాత ఎలా స్పందిస్తుందో చూడాలి!

1

2

3

4

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.