ఆఫర్లు లేకపోవడం పట్ల కాజల్ రొటీన్ రిప్లై

“సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడూ విలువలు మాట్లాడకూడదు” అని. ఈ డైలాగ్ ఇప్పుడు కాజల్ అగర్వాల్ కు కరెక్ట్ గా సరిపోతుంది. నిన్నమొన్నటివరకూ వచ్చిన ప్రతి సినిమా సైన్ చేస్తూ.. కోట్లకు కోట్లు సంపాదించిన కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. తమిళంలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో ఇటీవల ఓ హిందీ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ ను ఈమధ్య అవకాశం ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించగా.. “నటిగా ఇప్పుడు నేను పరిణితితో ఆలోచిస్తున్నాను. అందుకే వచ్చిన ప్రతి సినిమా సైన్ చేయడం లేదు.. నేను పోషించే పాత్ర సినిమాలో హైలైట్ అవుతుంది లేదా నా పాత్రలో కథ-కథనంలో కీలకపాత్ర పోషిస్తుంది అనుకున్న సినిమాలు మాత్రమే సైన్ చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది.

Actress Kajal Aggarwal Interview

ఇదే కాజల్ అగర్వాల్ “కవచం, సీత” సినిమాల్లో నటించడానికి ఏకంగా మూడు కోట్లు తీసుకున్న విషయం మర్చిపోయిందేమో. ఆఫర్లు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ కి వేల్యు ఇచ్చి.. ఆఫర్లు రానప్పుడు ఇలా మెచ్యూరిటీ లెవల్స్ గురించి మాట్లాడడం కాజల్ కి మాత్రమే చెల్లింది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.