కారు లేకపోవడంతో క్యాబ్ లో తిరుగుతున్నా : జయలలిత

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి చేసిన చిన్నచిన్న పొరపాట్ల వల్ల సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్న సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. అలా ప్రముఖ నటీమణులలో ఒకరైన జయలలిత కూడా ఏకంగా 4 కోట్ల రూపాయలు మోసపోయానని అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. తెలుగులో శృంగార, హాస్య పాత్రల్లో జయలలిత ఎక్కువగా నటించారు. ఈ మధ్య కాలంలో భరత్ అనే నేను సినిమాలో జయలలిత చేసిన స్పీకర్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న జయలలిత ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గడంతో సీరియల్స్ పై దృష్టి పెట్టారు. తాజాగా జయలలిత అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఆ షోలో అలీ ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ పాత్రలు చేయడం గురించి జయలలితను ప్రశ్నించారు. జయలలిత తాను అప్పట్లో ఫ్యామిలీతో కలిసి వచ్చేశానని.. తాను బ్రతకడం కోసం, ఫ్యామిలీని బ్రతికించడం కోసం ఆ పాత్రలు చేశానని అన్నారు. ఆ పాత్రలు చేసే సమయంలో తాను పెద్దగా ఫీల్ కాలేదని జయలలిత చెప్పుకొచ్చారు.

Actress Jayalalitha lost 4 crores1

సీరియళ్లు తీసే విజయనగరం రాజులు ట్యాక్స్ లు, జీఎస్టీలు కట్టలేకపోతున్నామని.. సీరియల్స్ చేయడం కష్టంగా ఉందని చెబితే నా దగ్గర ఉన్న డబ్బుతో సీరియళ్లు చేయమని వాళ్లకు చెప్పి డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేదాన్నని తెలిపారు. 2018 సంవత్సరం డిసెంబర్ నెల నాటికి వాళ్లు తన దగ్గర నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకుని చేతులెత్తేసి వెళ్లిపోయారని.. ఇప్పుడు నాకు కారు కూడా లేకుండా క్యాబ్ లో తిరిగే పరిస్థితి వచ్చిందంటూ జయలలిత కన్నీరుమున్నీరయ్యారు. ఈ షో ఫుల్ ఎపిసోడ్ 10వ తేదీన ప్రసారం కానుంది.


తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.