ఇది హేమ మాలిని మ్యారేజ్ కహానీ…!

హేమ మాలిని… తెలుగులో ఈమె నటించిన సినిమాలు రెండే… రెండు. ఒకటి ఎన్టీఆర్ తో చేసిన ‘శ్రీ కృష్ణ విజయము’ మరొకటి బాలయ్య -క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కావడం విశేషం. అయినప్పటికీ ఈమె తెలుగు ప్రేక్షకులలో… ముఖ్యంగా అప్పటి కుర్రకారుకి ఈమె పెద్ద క్రష్. అందుకే ఈమెకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈమె పెళ్ళి కహానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘హేమా మాలిని: బియాండ్ ద డ్రీమ్గర్ల్’ అనే పుస్తకం ద్వారా ఈమె లవ్ స్టోరీ బయట పడింది.గతంలో హేమా మాలిని పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రతో ప్రేమాయణం సాగించేదట.

ఈ విషయం తెలిసుకున్న కుటుంబ సభ్యులు ఆమె పై మండిపడ్డారట. వెంటనే మరో హీరో జితేంద్రతో ఈమె పెళ్లి కుదిర్చేశారట. తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పలేక హేమా మాలిని జితేంద్ర ను పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోయిందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. జితేంద్ర కూడా శోభా కపూర్ అనే ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. అయినప్పటికీ ఆయన కూడా ప్రెజర్ వల్ల హేమను పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడట. ఆ టైములో చెన్నైలో వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారట వీరి పెద్దలు. ఈ సంగతి పేపర్లో చదివి తెలుసుకున ధర్మేంద్ర, శోభ వెంటనే చెన్నై బయలుదేరారట. వెళ్ళడమే ఆలస్యం..

Actress Hema Malini opens up about her marriage story1

జితేంద్ర హేమ కుటుంబ సభ్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారట ధర్మేంద్ర, శోభ. హేమని దయచేసి నాకు అన్యాయం చెయ్యొద్దు అని ధర్మేంద్ర బతిమలాడాడట. ఏం చెయ్యాలో తెలియని పరిస్ధితుల్లో… కొంచెం టైమ్ కావాలని హేమ తన కుటుంబ సభ్యులను వేడుకుందట. దాంతో జితేంద్ర తో హేమ పెళ్లి వాయిదా పడింది. అటు తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.వీరి ప్రేమవ్యవహారం కూడా ముదిరింది.ఇక 1979 ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడట ధర్మేంద్ర. అటు జితేంద్ర పెళ్లి కూడా శోభా కపూర్ తో 1974 అక్టోబర్ 18న జరిగిందట.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.