సెకండ్ ఇన్నింగ్స్ లో సెటిల్ అవ్వడం కోసం హెబ్బా కష్టాలు

“కుమారి 21ఎఫ్” రిలీజ్ టైంకి హెబ్బా పటేల్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక బ్రాండ్. “అలా ఎలా”తో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆమెకు ఆ సినిమాతో ఆశించిన స్థాయి గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత యువ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది హెబ్బా. అందాల ఆరబోతకు, లిప్ లాకులకు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ & క్లివేజ్ ఎక్స్ పోజింగ్ కు ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో అమ్మడు బడా హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు అందరూ. కట్ చేస్తే.. డబ్బు కోసం చేసిన కొన్ని సినిమాల వల్ల అమ్మడి కెరీర్ పాడయ్యింది.

ఒకానొక స్టేజ్ లో అమ్మడు బరువు పెరగడం, ఆఫర్లు లేకపోవడంతో కెరీర్ అయిపోయినట్లే అనుకున్నారు. కట్ చేస్తే.. సన్నబడి, హీరోయిన్ అవకాశాలు మాత్రమే కాక అసలు అవకాశం వస్తే చాలు అనుకోని సినిమాలు చేయడం మొదలెట్టింది. “భీష్మ” చిత్రంలో పోషించిన చిన్నపాటి సెక్సీ రోల్ అమ్మడికి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత అమ్మడికి మళ్ళీ అవకాశాలు రావడం మొదలైంది. ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమాలో నటిస్తున్న హెబ్బా.. ఇప్పుడు మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది.

వినాయక్ వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న చిత్రంలో హెబ్బా ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ చిత్రంలో ఆమె చెవిటి మరియు మూగ యువతిగా కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ ప్రయోగాలతో పూర్వ వైభవం సంపాదించుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే.. అమ్మడు “రెడ్” చిత్రంలో చేసిన స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ఆమెకు భలే పాజిటివ్ గా నిలిచింది. ఆమెకు ఫిజిక్ పరంగా మంచి ఎలివేషన్ గా నిలిచింది. సో, బడా హీరోల సినిమాల్లో ఐటెం నెంబర్స్ కి అమ్మడికి ఆఫర్లు రావడం ఖాయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.