నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న హరితేజ బేబీ బంప్ ఫోటోలు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యింది హరితేజ.ఆ చిత్రంలో సమంత ఇంటి పనిమనిషిగా మంగమ్మ పాత్రలో ఈమె కనిపించింది. అటు తరువాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది.ఆ షో ద్వారా బోలెడంత మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంది. నిజానికి సీజన్ 1 విన్నర్ ఈమెనే అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఈమె మాత్రం విన్నర్ కాలేదు. కానీ హౌస్ లో ఈమె ప్రవర్తనను బట్టి ఈమెకు బోలెడంత క్రేజ్ పెరిగిందనేది వాస్తవం. ఇక ‘బిగ్ బాస్1’ తరువాత ఈమె వరుస సినిమాలలో అలాగే టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా..హరితేజ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వ బోతుంది. ఇదిలా ఉండగా..

మొన్నామధ్య సీమంతం ఫోటోలతో సందడి చేసిన హరితేజ ఇప్పుడు మరోసారి తన బేబీ బంప్ తో ఓ ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది.బ్లాక్ డ్రెస్లో ఆమె ఈ ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుండీ ఈమె సినిమాలకు , టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తోందన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు వాటికి బ్రేక్ ఇచ్చి… తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.