బిగ్ బాస్ 4: మెగాస్టార్ చిరు మూవీలో దివి..!

బిగ్ బాస్ స్టేజ్ మెగాస్టార్ రాకతో దద్దరిల్లిపోయింది. గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనదైన మార్క్ తో పంచ్ లు వేస్తూ , పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుతూ రెచ్చిపోయాడు. అందర్నీ పేరు పేరునా పలకరిస్తూ సీజన్ 3 కంటే సీజన్ 4 మంచి కిక్ ఇచ్చిందని చెప్పాడు. నాగార్జున తో సైటెర్స్ వేస్తూనే హౌస్ మేట్స్ గురించి తను అనుకున్నవి అన్నీ చెప్పాడు. ముఖ్యంగా సోహైల్ , అఖిల్, అభిజీత్ ల గురించి మాట్లాడాడు. అలాగే, దివిని చూస్తూ సిగ్గుపడిపోయాడు. అంతేకాదు, నెక్ట్స్ తన సినిమాలో క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఇమ్మని చెప్పి డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ ని అడిగాను అంటూ చెప్పాడు.

దీంతో దివి ఆనందంతో ఎగిరి గంతేసింది. వేదాళం సినిమా రీమేక్ త్వరలోనే చేయబోతున్నామని, దీనిలో ఒక పోలీస్ క్యారెక్టర్ లో దివిని ఫిట్ చేయమని పర్సనల్ గా మెహర్ రమేష్ ని అడిగాను అని, నా మాట కాదనలేక దివిని తీసుకున్నాడని చెప్పాడు. ఇక్కడే తన సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. చాలాకాలం నుంచి వేదాళం రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. డైరెక్టర్ ఎవరా అనేది తెలియలేదు. కానీ మెగాస్టార్ నోటి వెంటే మెహర్ రమేష్ అని వచ్చేసరికి ఇప్పుడు ఈ న్యూస్ హాట్ ఆఫ్ ద టాపిక్ గా మారింది.

ఇక దివికి ఒక 8నెలల్లో కాల్ వస్తుందని, ఆడిషన్స్ ఏమీ లేకుండానే నిన్ను సెలక్ట్ చేస్తారని చెప్పాడు. దివికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. దివితో పాటుగా మిగతా హౌస్ మేట్స్ ని కూడా తనదైన స్టైల్లో పలకరించాడు. అంతేకాదు, మెహబూబ్ ని చూస్తుంటే నన్ను నేను యంగ్ ఏజ్ లో చూసుకుంటున్నట్లుగా ఉంది అంటూ మాట్లాడాడు. సోహైల్ త్యాగం నచ్చి మెహబూబ్ కి గిఫ్ట్ చెక్ ఇవ్వడం అనేది విశేషం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.