Charmi: ”నా జీవితంలో ఆ తప్పు చేయను” : ఛార్మి

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తోంది. అయితే రీసెంట్ గా ఈమె పెళ్లి గురించి వార్తలు హల్చల్ చేశాయి. ఒకప్పుడు ఆమె దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందని.. అతడిని పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే కొన్నేళ్లకు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఛార్మి.. దర్శకుడు పూరి జగన్నాథ్ క్యాంప్ లో చేరి ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది.

కొన్నేళ్లుగా పూరితో కలిసి ఆయన తెరకెక్కించే సినిమాలను నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘లైగర్’ సినిమా పనులతో బిజీగా గడుపుతోంది ఛార్మి. అయితే ఇప్పుడు మళ్లీ ఛార్మి పెళ్లి వార్తలపై ఊహాగానాలు మొదలయ్యాయి. రెండురోజలుగా ఛార్మి తన బంధువుల్లో ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తనదైన శైలిలో స్పందించింది ఛార్మి. తన పెళ్లి వార్తలపై ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ దశలో ఉన్నానని చెప్పిన ఛార్మి.. జీవితంలో కూడా చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. కాబట్టి పెళ్లి అనే తప్పుని తన జీవితంలో ఎప్పటికీ చేయనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోదనే క్లారిటీ వచ్చేసింది. ఇదంతా కూడా పూరి ప్రభావం వలనే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ పెళ్లి చేసుకొని పిల్లలను కన్నారు కానీ పెళ్లి గురించి ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడుతుంటారు. చాలా ఏళ్లుగా పూరితోనే ఉంటున్న ఛార్మిపై ఆ మాత్రం ఇంపాక్ట్ ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.