నన్ను భయపెట్టారు.. విడాకులపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు..?

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అమలాపాల్. అమలాపాల్ మీరా అనే పాత్రలో నటించిన పిట్టకథలు గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై యావరేజ్ గా నిలిచింది. భర్త తరచూ అనుమానిస్తూ, వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఆ గృహహింస నుంచి మీరా ఎలా బయటపడిందో అమలాపాల్ తన పాత్ర ద్వారా తెలియజేశారు. అమలాపాల్ నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన అమలాపాల్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భర్త ఏఎల్ విజయ్ తో విభేదాలు వచ్చిన సమయంలో తాను భర్తతో విడిపోవాలని భావించానని కానీ ఆ సమయంలో అందరూ తనను భయపెట్టారని అమలాపాల్ చెప్పుకొచ్చారు. తనకు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదని.. భర్తతో విడిపోతే కెరీర్ నాశనమవుతుంటూ కొంతమంది హెచ్చరించారని అమలాపాల్ తెలిపారు.

సమాజం హేళన చేస్తుందని, తాను ఒక అమ్మాయినని.. విడిపోవాలని తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదంటూ కొంతమంది ఎగతాళి చేశారని అమలాపాల్ అన్నారు. తన సంతోషం గురించి కానీ తన మానసిక సంఘర్షణ గురించి కానీ ఎవరూ పట్టించుకోలేదని అమలాపాల్ వెల్లడించారు. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో 2014 సంవత్సరంలో అమలాపాల్ వివాహం జరిగింది. 2017 సంవత్సరంలో అమలాపాల్ భర్తతో విడిపోయారు.

విడాకుల తరువాత అమలాపాల్ ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేసినా అమలా మాత్రం ట్రోల్స్ ను పట్టించుకోకుండా కెరీర్ విషయంలో ముందడుగులు వేశారు. కొన్ని నెలల క్రితం అమలాపాల్ రెండోపెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాలేదు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.