రిలేషన్ షిప్ లో ఉన్న అమలా పాల్..ఇదే ప్రూఫ్!

తమిళ స్టార్ హీరోయిన్ అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత రాంచరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, నానితో ‘జెండా పై కపిరాజు’ వంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది. అయితే అతనితో ఈమె ఎక్కువ కాలం కలిసి జీవించలేదు.

మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అటు తరువాత విజయ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా అమల ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది. ఇటీవల ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్ లో నటించింది అమల. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక దీని ప్రమోషన్స్ లో భాగంగా.. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ‘ఏ.ఎల్‌ విజయ్‌తో విడిపోవాలనుకున్న టైములో నన్ను అందరూ భయపెట్టారు.

చాలా మంది అర్ధం చేసుకోకుండా.. నువ్వొక అమ్మాయివి.. నీ కెరీర్ పాడైపోతుంది అంటూ కామెంట్లు చేశారు.ఏ ఒక్కరూ నన్ను సపోర్ట్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అమలా పాల్.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.