ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!

సినిమాల్లో నటించాలి అనే ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు .. సోషల్ మీడియా లేని రోజుల్లో ఆడిషన్స్ కు వచ్చి సాయంత్రం వరకూ ఎదురుచూపులు చేసేవాళ్ళు. ఇప్పుడు పద్ధతి మారింది. సోషల్ మీడియా ఊపందుకున్నాక ట్యాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాల కోసం పరితపించాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో వీడియోల ద్వారా పాపులర్ అయినవాళ్లను సినిమా వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. ఒకవేళ సినిమాల్లోకి కాకపోయినా ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోలలో అయినా వారికి అవకాశాలు దక్కుతున్నాయి. అటు తరువాత అయినా వాళ్ళకు సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న గ్యారంటీ ఉంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న చాలా మంది నటీనటుల కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయ్యింది. వాళ్ళెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాజ్ తరుణ్ :

ఈ లిస్ట్ లో మొదట చెప్పుకోవాల్సింది రాజ్ తరుణ్ పేరే..! ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21.ఎఫ్’ వంటి హిట్ సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్న రాజ్ తరుణ్.. తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలుపెట్టాడు.

2)వైవా హర్ష :

కెరీర్ ప్రారంభంలో ఎన్నో స్పూఫ్ వీడియోలు చేసేవాడు. ‘వైవా’ వీడియో ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అటు తరువాత కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.తరువాత ‘గోవిందుడు అందరివాడేలే’ ‘దోచేయ్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘కలర్ ఫోటో’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడుగా బిజీగా అయిపోయాడు.

3)రాహుల్ రామకృష్ణ :

‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. అటు తరువాత ‘అర్జున్ రెడ్డి’ ‘భరత్ అనే నేను’ ‘గీత గోవిందం’ ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసాడు.

4) పూజిత పొన్నాడ :

‘ రంగస్థలం’ ‘కల్కి’ ‘బ్రాండ్ బాబు’ వంటి చిత్రాల్లో నటించిన పూజిత పొన్నాడ.. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

5)రీతు వర్మ :

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్లి చూపులు’ వంటి సినిమాలతో ఫేమస్ అయిన రీతూ వర్మ.. కెరీర్ ప్రారంభంలో ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలింలో నటించింది.

6)చాందినీ చౌదరి :

‘బ్రహ్మోత్సవం’ ‘శమంతకమణి’ ‘మను’ ‘కలర్ ఫోటో’ వంటి చిత్రాల్లో నటించిన చాందినీ చౌదరి.. తన కెరీర్ ప్రారంభంలో ‘మధురం’ వంటి సూపర్ హిట్ షార్ట్ ఫిలింలో నటించింది.

7) సుహాస్ :

ఈ మధ్యనే ‘కలర్ ఫోటో’ చిత్రంతో హిట్ అందుకుని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ‘మజిలీ’ ‘డియర్ కామ్రేడ్’ ‘ప్రతీరోజూ పండగే’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతని కెరీర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయ్యింది.

8) విశ్వక్ సేన్ :

హీరోగా వరుస హిట్లు అందుకుంటున్న మన మాస్ క దాస్ కూడా ‘పిట్ట కథ’ అనే షార్ట్ ఫిలింతోనే తన కెరీర్ ను మొదలుపెట్టాడు.

9)విజయ్ దేవరకొండ :

మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే షార్ట్ ఫిలిం ద్వారానే తన కెరీర్ ను మొదలుపెట్టాడు.

10)విజయ్ సేతుపతి :

తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ సేతుపతి.. షార్ట్ ఫిలిమ్స్ తోనే తన కెరీర్ ను మొదలుపెట్టాడు.

11)నవీన్ పోలిశెట్టి :

ఈ కుర్ర హీరో కూడా AIB లో ఎన్నో వీడియోస్ చేసాడు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పై చేసిన ఓ వీడియోతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

12) ప్రియాంక జవాల్కర్ :

‘ట్యాక్సీ వాలా’ చిత్రంతో ఫేమస్ అయిన ప్రియాంకా జవాల్కర్… ప్రస్తుతం ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ కూడా ‘ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ’ అనే షార్ట్ ఫిలింతోనే తన కెరీర్ ను ప్రారంభించింది.

Share.