ఈ సినిమాలు సురేష్ ఎందుకు వదులుకున్నాడో తెలుసా..?

హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు సురేష్. రీసంట్ గా ఒక ఫేమస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలలో తన మనసులో మాటలన్ని పంచుకున్నాడు. నిజానికి సురేష్ కెరియర్ బిగినింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డానని ఈ ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాదు, తమిళంలో లవర్ బాయ్ ఇమేజ్ ని కావాలనే బ్రేక్ చేయాల్సివచ్చిందన్నాడు.

నిజానికి మణిరత్నం తీసిన రోజా సినిమాలో హీరోగా ఫస్ట్ ఆఫర్ తనకే వచ్చిందని, అప్పుడున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ఆఫర్ ని వదిలేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడైనా రోజా పాటలు వినబడితే చాలా బాధగా అనిపిస్తుందని చెప్పాడు. అంతేకాదు, నాలుగు స్థంబాలాట సినిమా, అలాగే భారతీరాజా తీసిన బిగ్గెస్ట్ హిట్ అయిన సీతాకోకచిలుక సినిమాలు హీరోగా మొదట్లో నన్నే అడిగారు అని అన్నాడు.

ఈ సినిమాలన్నింటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందని క్లారిటీ కూడా ఇచ్చాడు. రోజా సినిమాకి మణిరత్నం గారు అడిగినపుడు నేను తెలుగులో పరువు ప్రతిష్ట అనే సినిమా చేస్తున్నాను అని, అప్పుడు రామానాయుడు గారిని డైరెక్ట్ గా వెళ్లి అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నాడు. అప్పటికే రామానాయుడు గారి బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాను అని అందుకే మణిరత్నంగారికి నో చెప్పాల్సి వచ్చిందని అన్నాడు. అంతేకాదు, నాలుగు స్థంబాలట సినిమా అప్పుడు కూడా ఇదే జరిగిందని, వేరే ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేయలేకపోయానని అన్నాడు.

ఇక సీతాకోక చిలుక సినిమా అప్పుడు మొదటి హీరోగా స్క్రీన్ పైన ఇంట్రడ్యూస్ అవ్వాలి అని భారతీరాజాగారు అడిగినపుడు నేను ఆల్రెడీ ఒక సినిమాకి కమిట్ అయ్యాను అని, అందుకే ఫస్ట్ సినిమా చేయలేకపోయాను అని అన్నాడు. నేను మొదటి చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యిందని, తమిళంలో వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పాడు. ఇలా చాలా సినిమాలకి కేవలం బిజీ షెడ్యూల్స్ వల్ల పని చేయలేకపోయాను అని, ఒకానొక సందర్భంలో అయితే సంవత్సరానికి 18 సినిమాలు కూడా చేశాను అని, డే అండ్ నైట్ మూడు షిఫ్ట్స్ లో పని చేశానని చెప్పుకొచ్చాడు ఈ విలక్షణ నటుడు. అప్పట్లో కోడిరామకృష్ణగారు తీసిన అమ్మోరు సినిమాకి మంచి గుర్తింపు లభించిందని అన్నాడు. ఏది ఏమైనా గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు యాక్టర్ సురేష్.


జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Share.