ఎఫైర్ రూమర్స్.. విజయశాంతితో పదేళ్లు మాటల్లేవ్

సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ నటీనటులలో ఒకరైన సురేష్ మొదట్లో హీరోగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా ఎన్నో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు. పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేసేశారు. అయితే ఇటీవల సురేష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ తో ఏర్పడిన విభేధాలపై స్పందించారు. ఇటీవల అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న సురేష్ తన కెరీర్ ను గుర్తు చేసుకుంటూ ఒకసారి రూమర్స్ క్రియేట్ అవ్వడం వలన సీనియర్ హీరోయిన్ తో పదేళ్లు మట్లాడలేదని చెప్పారు.

ఒకానొక సమయంలో ఇలాంజోడింగళ్ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉందని రూమర్స్ క్రియేట్ చేసింది మొదట నిర్మాత అనుకున్నాను. కానీ ఆ తరువాత ఆయన కాదని తెలిసింది. ఆ హీరోయిన్ టీమ్ కు చెందినవారే ఈ పుకార్లు క్రియేట్ చేశారని నాకు సమాచారం రాగానే నేను ఆమెతో మాట్లాడలేదు. ఆ హీరోయిన్ కూడా నాతో మాట్లాడలేదు. ఇక మాటలు లేకుండానే మూడు నాలుగు సినిమాలు కలిసి చేశాము.

ఒకానొక సమయంలో పదేళ్ల తరువాత అనుకోకుండా ఒక షూటింగ్ లో ఎదురుపడినప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగి మంచిగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశామని సురేష్ వివరణ ఇచ్చారు. ఆ హీరోయిన్ ఎవరనే విషయం సురేష్ డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఇలాంజోడింగళ్ హీరోయిన్ అనగానే అందరికి ఆమె విజయశాంతి అని అర్ధమయ్యింది.

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.