‘మా’ పాలక వర్గానికే తెలియదు.. మేము ఎలా ఆహ్వానిస్తాం..!

సినిమా పెద్దలకు, తెలంగాణా ప్రభుత్వానికి మధ్య జరిగిన కీలక సమావేశాలకు బాలయ్యను పిలవని నేపథ్యంలో ఆయన నిన్న ఆయన తన అసహనం తెలియజేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన వాఖ్యలు పరిశ్రమలో వేడి రాజేయగా, నిర్మాత సి కళ్యాణ్, బాలయ్యను పిలవాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ది అన్నారు. ఈ వ్యాఖ్యాలపై నటుడు నరేష్ స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఓ తన అభిప్రాయం తెలియజేశారు. ఆయన నాకే ఈ మీటింగ్స్ పై అవగహన లేదు.

అలాంటిది మేము ఎలా బాలయ్యను పిలుస్తాము అన్నారు. బాలయ్య రాజేసిన ఈ కుంపటి మెల్లగా చిత్ర పరిశ్రమ మొత్తం పాకుతున్నట్లుంది.సీ కళ్యాణ్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ఆయన మాటలు విని షాక్ అయ్యాను.చిరంజీవి, కేసీఆర్‌లతో జరిగిన మీటింగ్‌కు బాలయ్యను పిలవాల్సిన బాధ్యత ‘మా’ది అనడం వింతగా ఉందని చెప్పుకొచ్చాడు. మా అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీకి గానీ నాకు గానీ ఆ విషయం గురించి సమాచారం లేనప్పుడు తాము ఎలా బాలయ్యను పిలుస్తామని వివరణ ఇచ్చాడు.

Actor Naresh Interview

ఈ విషయంలో కొందరు బాలయ్యను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు నాగబాబు బాలయ్య పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బాలయ్య ఇండస్ట్రీలో కేవలం ఒక హీరో మాత్రమే అని ఎద్దేవా చేశారు. అలాగే క్షమాపణ డిమాండ్ చేశారు. వరుణ్ తేజ్ సైతం ట్విట్టర్ లో తాజా వివాదాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం కొసమెరుపు.

Most Recommended Video

జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.