ఎమోషనల్ అయిన హేమ.. స్టేజి పైనే కన్నీళ్ళు పెడుతూ కామెంట్లు..!

ఇటీవల ప్రదీప్ హీరోగా వచ్చిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం విడుదలయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రంలో తల్లి పాత్ర పోషించిన హేమ చేసిన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొడుకుని అతిగా ప్రేమించే ఓ తల్లి.. కానీ ఆ కొడుకు నుండీ తిరిగి ప్రేమను పొందలేక బాధపడే పాత్రలో కనిపించింది హేమ.

ఇక ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నాకు నటిగా రెండు నంది అవార్డులు వచ్చినా.. ఎపుడూ నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుండో ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను. చాలా సార్లు ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ అన్నయ్యకు చెప్పాను. నేను తల్లి పాత్ర కోసం పూరీ అన్నయ్యతో చాలా సార్లు గొడవపడ్డాను. తరువాత సుకుమార్‌ గారితో కూడా గొడవ పడితే.. ‘కుమారి 21F’ లో మంచి తల్లి పాత్రను నాకు ఇచ్చారు. ఆ చిత్రంలో నా పాత్రకు ప్రశంసలు దక్కాయి.

తర్వాత ఎవ్వరూ నాకు అలాంటి పాత్ర ఇవ్వలేదు. ఇన్నాళ్టికి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ద్వారా నాకు కోరుకున్న పాత్రకు దక్కింది. ఈ పాత్రకు వస్తోన్న స్పందన చూస్తుంటే నాకు కళ్ళంట నీళ్లు ఆగడం లేదు.నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి, హీరోకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజజీవితంలో ప్రదీప్ ను నేను తమ్ముడు అని పిలుస్తుంటాను. హేమకు తల్లి పాత్ర అంటే జనాలు నవ్వుతారు అనే ఆలోచన కూడా లేకుండా నాకు ఈ పాత్ర దక్కేలా చేసాడు ప్రదీప్” అంటూ చెప్పుకొచ్చింది హేమ.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Share.