యాక్షన్… ఆపోజిట్ రియాక్షన్..!

విశాల్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. విశాల్ కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాల్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాన్ని కూడా పెద్ద స్థాయిలో విడుదల చేశారు. మొదటిరోజు ఈ చిత్రానికి డీసెంట్ టాక్, రివ్యూలు అయితే వచ్చాయి కానీ ఆ టాక్ ను.. ఆ పాజిటివ్ రివ్యూలను ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయిందనే చెప్పాలి..!

Action Movie Review2

ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి ‘యాక్షన్’ చిత్రానికి 2.56 కోట్ల షేర్ ను మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 6.7 కోట్లకు అమ్మారు. ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో .. 4 కోట్ల షేర్ అయినా రాబట్టాలి. కానీ ఇక అది కుదిరేలా లేదని ట్రేడ్ పండితులు తేల్చేసారు. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోయినా ‘జార్జ్ రెడ్డి’ ‘రాగాల 24 గంటల్లో’ వంటి ఎంతో కొంత క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద ‘యాక్షన్’ కు ఎదురీత తప్పేలా లేదు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.