మెగా ఫన్ ని మ్యాచ్ చేయగలడా..?

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే భారీ సెట్ ను ఏర్పాటు చేసి షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. కొరటాల తన గత సినిమాల మాదిరి సామాజిక కోణంలోనే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. కొరటాల సినిమాలన్నీ కూడా సీరియస్ టోన్ లో సాగిపోతుంటాయి. కామెడీ సన్నివేశాలకు కొరటాల పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు.

‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ ఇలా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చూస్తే అందులో కామెడీ ట్రాక్ లు చెప్పుకునే స్థాయిలో ఉండవు. ఇప్పుడు కొరటాల.. మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తున్నారు. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన బాడీ లాంగ్వేజ్ లోనే చాలా సరదా ఉంటుంది. మెగా ఫన్ ని మ్యాచ్ చేస్తూ కామెడీ ట్రాక్ పెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కొరటాల ముందున్న ఛాలెంజ్ ఇదే. ప్రస్తుతం ‘ఆచార్య’లో కామెడీ ట్రాక్ ని సెట్ చేసే పనిలో పడ్డాడు.

ముందుగా కొరటాల టీమ్ ఓ ట్రాక్ రెడీ చేసింది. ఇది పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. మరో రచయిత శ్రీధర్ సీపానని ఆశ్రయించారు. ఆయన కూడా ఓ ట్రాక్ రెడీ చేశాడు. కానీ అది మెగాస్టార్ కి నచ్చలేదు. దీంతో ఇప్పుడు మరో రచయిత బీవీఎస్ రవిని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ కోసం కామెడీని సృష్టించే పనిలో ఉన్నాడు. ఈ ట్రాక్ చిరంజీవికి నచ్చితే ఓకే.. లేదంటే మరో రచయితను కూడా తీసుకొచ్చేలా ఉన్నారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.