రామ్ చరణ్ పుట్టినరోజుకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్

రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 అని ప్రత్యేకించి గుర్తుచేయాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులకు అది చిన్నసైజు సంక్రాంతి లాంటిది. ఇక హీరో పుట్టినరోజు అంటే ఆయన నటించే సినిమాల అప్డేట్స్, పోస్టర్స్, టీజర్స్ విడుదలవ్వడం అనేది సర్వసాధారణం. అయితే.. ఈసారి చరణ్ పుట్టినరోజుకి మాత్రం మెగా అభిమానులకు ఫీల్ మీల్స్. ఆ ఫుల్ మీల్స్ “ఆర్ ఆర్ ఆర్” అప్డేట్ అనుకొనే పప్పులో కాలేసినట్లే. “ఆర్ ఆర్ ఆర్” నుంచి ఎలాగో అదిరిపోయే అప్డేట్ రిలీజ్ చేసేపనిలో ఆల్రెడీ రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నాడనుకోండి.

అయితే.. ఈ ఏడాది చరణ్ పుట్టినరోజుకి మాత్రం “ఆర్ ఆర్ ఆర్” టీం కంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది “ఆచార్య” టీం. అదేంటంటే.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న “ఆచార్య” సినిమాలో చరణ్ లుక్ ను మాత్రమే కాకుండా.. చరణ్ వెనుక చిరంజీవి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది బృందం. ఈ మేరకు ఆడియన్స్ కు హింట్ ఇస్తూ ఇవాళ ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశారు.

చరణ్-చిరంజీవిలను “మగధీర, ఖైధీ నెం.150” చిత్రాల్లో చూసినప్పటికీ.. ఇద్దరు కలిసి తెరపై పవర్ ఫుల్ రోల్లో మాత్రం కనిపించలేదనే వెలితి అభిమానులకు “ఆచార్య”తో తీరిపోతుంది. కుదిరితే.. ఇద్దరి కాంబినేషన్ సీన్ తో ఒక టీజర్ కూడా రిలీజ్ చేయాలనుకుంటుంది టీం ఆచార్య. మరి వాళ్ళ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.