తమ సినిమాటోగ్రఫీ తో మనల్ని అలరించిన కెమెరామెన్లు వీరే..!

మూడ్ ఆఫ్ లో ఉన్న ఓ హీరో రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంటాడు.. కొంచెం దూరం వెళ్ళాక కార్ లో నుండీ దిగిన హీరోయిన్ ను గమనిస్తాడు. చీకటి కావడం వలన హీరోయిన్ పేస్ సరిగ్గా కనపడదు. అయితే ఆ సమయంలో కొందరు పిల్లలు దీపావళి చిచ్చుబుడ్డి వెలిగిస్తారు. ఆ వెలుగులో హీరోయిన్ పాదాలు… అలాగే పేస్ కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటికీ బెస్ట్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఇదే.. నో డౌట్..! (ఈ సీన్ ఏ సినిమా అనేది చెప్పనవసరం లేదు కదా..?)

ఇలా డైరెక్టర్ పేపర్ మీద రాసిన సీన్ లెన్స్ తో కవర్ చేసి 70 ఎం.ఎం. స్క్రీన్ మీద చూసే ఆడియన్స్ ని అలరించడం … సినిమాటోగ్రఫేర్ రోల్. డైరెక్టర్ గుండెల్లో ఉన్న ఓ ఆలోచనని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించి ప్రశంసలు అందుకున్న కొందరు సినిమాటోగ్రఫర్లను చూద్దాం రండి.

1)  రత్నవేలు

1rathnavelu

టాలీవుడ్ ది బెస్ట్ కెమెరామెన్ లలో రత్నవేలు ఒకరు. ‘ఆర్య’, ‘1 నేనొక్కడినే’, ‘కుమారి 21 f’ ‘రంగస్థలం’ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ చిత్రాల్లో ఆయన కెమెరా వర్క్ ను అభినందించాల్సిందే. మధ్యలో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్ అయినా… ఈ చిత్రంలో రత్నవేలు కెమెరా పని తనానికి 100 కి 100 మార్కులు పడ్డాయి. ఇప్పుడు ‘సైరా’ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా పనిచేస్తున్నాడు రత్నవేలు.

2) సెంథిల్ కుమార్

2senthil-kumar

రాజమౌళి అద్భుతాల్ని వెండితెర పై ఆవిష్కరించేది సెంథిల్ కుమారే..! ‘మగధీర’ ‘ఈగ’ ‘బాహుబలి 1’ ‘బాహుబలి 2’ చిత్రాలతో ‘హై స్టాండర్డ్స్’ అవుట్ ఫుట్ ఇచ్చాడు సెంథిల్. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఉపయోగించని 150 ఎం.ఎం. ‘సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్’ ను ఉపయోగిస్తున్నాడట.

3) మది

3madhie

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘ఘాజి’ ,’భాగమతి’ .. ఈ మూడు సినిమాల్లోనూ మది కెమెరాతనం అద్భుతమని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ చిత్రాన్ని కూడా హాలీవుడ్ స్టైల్ లో చూపించడానికి రెడీ అయ్యాడు.

4) ఎస్. తిరునవుకరుసు(తిరు)

4thirunavukarasu

‘జనతా గ్యారేజ్’ లో తారక్ ను, ‘భరత్ అనే నేను’ లో మహేష్ ను, మొన్నటికి మొన్న ‘పేట’ సినిమాలో రజినీ ను ఓ రేంజ్లో చూపించాడు తిరు. ఇప్పుడు మెగాస్టార్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా తిరు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తాడనే టాక్ నడుస్తుంది.

5)  డానీ సంచెజ్- లోపెజ్

5dani-sanchez-lopez

సావిత్రి గారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు డానీ సంచెజ్- లోపెజ్. ఆమె సినీజీవితాన్ని ఈయన చూపించినంత వాస్తవంగా ఎవరూ చూపించలేరు అనేలా తన మార్క్ వేసుకున్నాడు. ఏదేమైనా డైరెక్టర్ అనుకున్నదానికంటే 10 రెట్లు ఎక్కువ ‘ఔట్ ఫుట్’ ఇచ్చాడనే చెప్పాలి.

6)  పి.జి.వింద

6pg-vinda

చెప్పుకోవడానికి మీడియం బడ్జెట్ సినిమాలైన ‘జెంటిల్ మేన్’ ‘సమ్మోహనం’ చిత్రాలకి రిచ్ లుక్ ని తెచ్చాడు వింద. హీరోల పై పెట్టే క్లోజప్ షాట్లను కూడా బాలీవుడ్ రేంజ్ లో చూపించాడు.

7) షానీల్ డియో

7shaneil-deo

స్పై కథాంశంతో వచ్చే సినిమాల్లో సినిమాటోగ్రఫీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ చిత్రానికి మంచి కెమెరా వర్క్ ఇచ్చాడు. డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకాన్ని 100 కు 100 శాతం నిలబెట్టి.. సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు షానీల్ డియో.

8)  పి.ఎస్.వినోద్

8ps-vinod

‘ధృవ’ వంటి థ్రిల్లర్ అయినా… ‘హలో’ వంటి ప్రేమ కథ అయినా… ‘అరవింద సమేత’ వంటి మాస్ చిత్రమైనా.. వినోద్ తన సినిమాటోగ్రఫీ తో మరింత అందాన్ని ఇచ్చాడు. ఈయన కూడా ‘ది బెస్ట్ కెమెరామెన్ అని చెప్పడంలో సందేహం లేదు.

9) కార్తీక్ ఘట్టమనేని

9karthik-ghattamaneni

ఈ కుర్ర కెమెరామెన్ కచ్చితంగా బెస్ట్ కెమెరామెన్ అనే చెప్పాలి. ‘నిన్ను కోరి’ ‘అ!’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలని చాలా అందంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు కార్తీక్. మిడిల్ ఆర్డర్ సినిమాలకి పెద్ద దిక్కుగా మారిపోయాడు. ముందు ముందు మరింత పెద్ద స్థాయిలో ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.

10) సాను వర్గీస్‌

10sanu-varghese

యూనివెర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ ‘విశ్వరూపం2’ చిత్రాలకి అద్భుతమైన సినిమాటోగ్రఫి అందించాడు. అంతేకాదు తెలుగులో ఇటీవల విడుదలైన మన నేచురల్ స్టార్ నాని.. ‘జెర్సీ’ చిత్రానికి కూడా సాను వర్గీస్‌ నే సినిమాటోగ్రఫీ అందించాడు. 1980, 90 సంవత్సరాలకి మనల్ని తీసుకెళ్లాడు. ఈ సినిమాటోగ్రఫీ బ్రిలియన్ట్ అనే చెప్పాలి.

Share.