ఆయన ప్రోత్సాహం, గుణం సూపర్‌ అంటున్న అభిజీత్‌

‘‘నేను చూశాను నీ ఫస్ట్‌ సినిమా. నువ్వు హీరో మెటీరియల్‌వి’’- ‘బిగ్‌బాస్‌ 4’ విజేత అభిజీత్‌తో టాలీవుడ్‌ ‘బిగ్‌బాస్‌’ చిరంజీవి అన్న మాటలివీ… ఇదెప్పుడు జరిగిందా అనుకుంటున్నారా? ఇటీవల అభిజీత్‌ వెళ్లి చిరంజీవిని కలిశారట. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని, కలిసినప్పుడు జరిగిన మాటల్ని, ముచ్చట్ల్ని, మూమెంట్స్‌ని అభిజీత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు ఆయనను కలిశాక తన మనసులోని మాటల్ని కూడా అభిజీత్‌ ఆ పోస్టులో రాసుకొచ్చాడు.

‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఏంటో ఈ రోజు చూశాను. ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా.. ఇంకా డౌన్‌ టు ఎర్త్‌లో ఉంటారాయన. ఈ రోజు ఆయన్ను కలిసినప్పుడు నా మీద ఆయన చూపించిన ప్రేమ, అభిమానం, ప్రోత్సాహం అద్భుతం. నా గురించి ఆయన చూపించిన శ్రద్ధ చూసి ఆశ్చర్యమేసింది. ఆయన మాటల్లో నా మీద ఉన్న అభిమానం కనిపించింది. మీ మాటలు నా జీవితంలో మార్గదర్శకాలు. నా లాంటి యువకుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు అభిజీత్‌.

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేత అభిజీత్‌ను ప్రకటించే సమయంలో చిరంజీవి అక్కడే ఉన్నారు. స్టేజీ మీదే అభిజీత్‌ను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా మరోసారి అభిజీత్‌ చిరంజీవిని ఎందుకు కలిసినట్లు.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ. చిరంజీవి కంట పడ్డారు అంటే… ఆ నటుడికి మహర్దశ తగిలినట్లే. సత్యదేవ్‌ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తున్నాడని వింటున్నాం. మరి అభిజీత్‌ కూడా ఏమన్నా గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశాడా? చూద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Abijeet (@abijeet11)


Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.