ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ అభిజిత్‌ ‘బిగ్ బాస్ సీజన్ 4’ లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఎంతో కూల్ గా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో పాటు.. ‘ మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రంతోనూ నటించాడు అభిజీత్. అయితే ఆ సినిమాల తరువాత కొన్ని కారణాల వల్ల యూ.ఎస్ వెళ్ళాడట. అటు తరువాత ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.ఇక అభిజిత్ కు అక్కినేని ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధమే ఉంది. నాగార్జున రెండో కొడుకు అఖిల్ చదివిన కిండర్ గార్టెన్ (చైతన్య విద్యాలయ) స్కూల్‌‌లోనే అభిజిత్ కూడా చదువుకున్నాడు.

అఖిల్ కు ఇతను స్కూల్ మేట్‌ మాత్రమే కాదు క్లాస్ మేట్ కూడా.ఇదిలా ఉండగా.. అభిజిత్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఆఫర్ వచ్చిందట. అదే చిత్రంలో విచిత్రంగా అక్కినేని అమల కూడా అభిజిత్‌ కు తల్లిగా నటించడం జరిగింది. అక్టోబర్ 11, 1988 లో జన్మించాడు అభిజీత్. ఇతని కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు చార్మినార్ నిర్మాణంలో పాలు పంచుకున్నారట.! అప్పట్లో చార్మినార్ గోడలు మరియు నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి అభిజిత్ పూర్వీకులు వలస వచ్చారట. చార్మినార్ నిర్మాణం కోసం.. గుడ్లు పగలగొట్టడం, పచ్చసొనను కాంక్రీట్ మిశ్రమంలో కలపడం వంటి పనులు చేసేవారట.

ఇప్పటికీ అభిజిత్ ఫ్యామిలీ అటువంటి నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే అభిజిత్ మాత్రం సినిమాల పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు మళ్లినట్టు తెలుస్తుంది. ఇక ‘బిగ్ బాస్4’ లో అభిజీత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మనం ఇప్పటి వరకూ చూడని అభిజీత్ రేర్ ఫోటో గ్యాలెరీని ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

47

48

Share.