బిగ్ బాస్ 4: బిగ్ బాస్ మాటలకి ఫిదా అయిన అభిజిత్..!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరి 100రోజుల జెర్నీని చూపించడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. కేవలం జెర్నీ చూపించడమే కాదు, ఈ వందరోజులు హౌస్ లో వాళ్లు ఎలా నడుచుకున్నారు. ఎలా ప్రవర్తించారు. ఎలా తమని తాము కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ల భావోద్వేగాలు ఎలా నియంత్రించుకున్నారో కూడా చెప్పాడు.ఆడియో వీడియో వ్యూజవల్ స్టార్ట్ కాకముందు బిగ్ బాస్ పార్టిసిపెంట్ గురించి ఎమనుకున్నాడో కూడా వాయిస్ ద్వారా వినిపించాడు. అభిజిత్ గురించి మాట్లాడుతూ..

మీరు ఇంట్లోకి యంగ్ ఛార్మింగ్ బాయ్ లాగా వచ్చారు. కానీ, మీరు అందరి ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్ గా అయ్యారు. మీరు మీకంటే కూడా వేరేవాళ్లకోసమే ఎక్కువుగా ఆలోచించారు. పరిపక్వత చెందిన వ్యక్తిగా అందరి పట్ల శ్రధ్దచూపించారని చెప్పాడు. అంతేకాదు, కొన్ని భావోద్వేగాలని ఎవరికీ షేర్ చేసుకోకుండా మీలోనే దాచుకుని కుమిలిపోయారని, చాలా బాగా హౌస్ ని హ్యాండిల్ చేస్తూ 100రోజుల జెర్నీని సాగించారని చెప్పాడు. మీలాంటి తెలివైన హౌస్ మేట్ ఉండటం నిజంగా గర్వంగా ఉందని బిగ్ బాస్ చెప్పడంతో అభిజిత్ స్పందించాడు. నేను బిగ్ బాస్ కి రావడం అనే నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా తెలివైన పని అని, అందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంటూ స్పీచ్ ఇచ్చాడు.

తర్వాత అభిజిత్ జెర్నీ చూస్తూ భావోద్వేగానికి గురి అయ్యాడు. ముఖ్యంగా రోబో టాస్క్ ని చూసుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు. అంతేకాదు, తన జెర్నీలో మోనాల్ తో మాట్లాడిన కబుర్లు, అఖిల్ తో పోట్లాడిన మాటలు అన్నింటిని చూసి ఎమోషనల్ అయిపోయాడు అభిజిత్. బరువెక్కిన గుండెతో వెళ్లి తోటి హౌస్ మేట్స్ ని హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, హారిక అండ్ అరియానాలతో జస్ట్ ఎవి చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.