అభిజిత్ ను సర్‌ప్రైజ్ చేసిన ఇండియన్ క్రికెటర్!

బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతగా నిలిచిన అభిజిత్.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. రోహిత్ శర్మ స్వయంగా అభిజిత్ కి ఫోన్ చేసిన మాట్లాడారట. అంతేకాదు.. ప్రేమతో తన జెర్సీను అతడికి గిఫ్ట్ గా పంపించాడు రోహిత్ శర్మ. ఈ విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మకు, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్ బాస్ షో గురించి చర్చకు వచ్చిందట.

ఈ సందర్భంగా బిగ్ బాస్ నాలుగో సీజ్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్ కి చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా.. తను అభిజిత్ కి పెద్ద ఫ్యాన్స్ అని అన్నాడట. దీంతో రోహిత్.. అభిజిత్ కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారట. అలానే తన జెర్సీని గిఫ్ట్ గా పంపించారట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్.. రోహిత్ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

రోహిత్ శర్మ తన అభిమాన క్రికెటర్ అని.. అతడి నుండి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిజిత్ హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నాడు. పలు స్క్రిప్ట్ లను వింటున్నాడు. త్వరలోనే హీరోగా తన సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.