మూడు కథలు రెడీ… సినిమా చేస్తాను.. కానీ..? : అభిజీత్

బిగ్ బాస్ 4… విన్నర్ అయిన అభిజీత్… ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఓ పక్క బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లు అయిన మోనాల్, అఖిల్, సోహెల్ వంటి వారు .. తాము నటించబోయే సినిమాల విషయమై చాలా వరకూ క్లారిటీ ఇచ్చేశారు. ఆరియాన, అవినాష్ వంటి వారు ఎలాగూ టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

ఇక సుజాత,లాస్య,హారిక వంటి వారు కూడా బుల్లితెర పై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విన్నర్ అభిజీత్ కూడా సినిమాల్లో నటించాలని ఆయన అభిమానుల కోరుకుంటున్నారు. ఇక అభిజీత్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీనే అట. ప్రస్తుతం అతను 3 స్క్రిప్ట్ లు ఫైనల్ చేశాడట. అవన్నీ అతనికి బాగా నచ్చయట. కానీ వాటిలో ఏది ముందు చేస్తే బెటర్ అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నాడట. వీటి పై క్లారిటీ వచ్చిన వెంటనే సినిమా చేసెస్తా అని అభి చెప్పాడు.

అంతేకాదు మరికొన్ని కథలు స్టోరీ నచ్చినప్పటికి కొన్నిటికి రైటింగ్ బాలేదని.. దాంతో తాను కూడా స్క్రిప్ట్ పై వర్క్ చేశానని అభిజీత్ తెలిపాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2021 లో అభిజీత్ నుండీ 3 సినిమాలు వస్తాయన్న మాట..!

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Share.