బిగ్ బాస్ 4: అభిజీత్ కామెంట్స్ వైరల్..!

బిగ్ బాస్ హౌస్ లో 100రోజుల పాటు గేమ్ ఆడి ఫైనల్స్ వరకూ వచ్చి అటు హౌస్ మేట్స్ ని, ఇటు ప్రేక్షకులని గెలవాలి అంటే అది మామూలు విషయం కాదు, హౌస్ మేట్స్ తో పడకపోతే నామినేట్ అవుతాం.. ప్రేక్షకులతో కలిసిరాకపోతే ఎలిమినేట్ అవుతాం. ఇలాంటి టైమ్ లో లెగ్ పైయిన్ సివియర్ గా వేధిస్తుంటే నోయల్ తనంతటా తానే తెల్లవారుఝామున బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకి వచ్చేశాడు. అభిజీత్, హారిక, మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా నోయల్ ని సాగనంపారు.

ఇక్కడే అభిజీత్ హౌస్ మేట్స్ తో ఎంత కేరింగ్ గా ఉంటాడో అని నోయల్ స్టేజ్ పైన సపోర్ట్ కూడా చేశాడు. తర్వాత రీ ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నా కూడా అది జరగలేదు. కానీ, రీయూనిన్ మాత్రం కనిపించి హౌస్ మేట్స్ కి ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు. తనదైన స్టైల్లో ర్యాప్ చేస్తూ హౌస్ మేట్స్ ని ఉత్సాహపరిచాడు. ఫినాలేకి వాళ్లని ప్రిపేర్ చేశాడు. హౌస్ మేట్స్ రీయూనియన్ లో గంగవ్వ, సుజాతలు ఇంటినుంచి సందేశాన్ని తీస్కుని వస్తే, నోయల్ – అవినాష్ లు సోలోగా వచ్చి హౌస్ మేట్స్ కి మంచి బూస్టప్ ఇచ్చారు.

ఇక నోయల్ కోసం ముందుగానే ఒక వాటర్ బాటిల్ ని రెడీ చేసిన అభిజీత్ అతనికి ఆ బాటిల్ ఇచ్చాడు. ఆ బాటిల్ పైన ‘నోయ‌ల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు’ అని రాయడంతో అభిజీత్ తన మనసులో మాటల్ని చెప్పాడు. నువ్వు టైటిల్ విన్నర్ అవుతావని అనుకున్నా, కానీ వెళ్లిపోయావ్ అంటూ మాట్లాడేసరికి, నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాల‌దా అంటూ మాట్లాడాడు. ఇప్పుడు అభిజీత్ అన్నమాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఇక నోయల్ వెళ్లిపోతూ ఈ బిగ్‌బాస్ త‌న‌కు ఎంతో ఇచ్చింద‌ని, కానీ త‌ను ఏమీ తిరిగివ్వ‌లేక‌పోతే క్ష‌మించండి అంటూ తనదైన స్టైల్లో బైబై చెప్పాడు. అదీ విషయం.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

Share.